News

LIC 60 వ వార్షికోత్సవ వేడుకలు


లైఫ్,ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (LIC) వారోత్సవాలలో భాగంగా  జగ్గయ్యపేట బ్రాంచ్ స్థాపించి 59 సంత్సరాలు పూర్తీ చేసుకొని 60 వ సంత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మంగళవారం ఉదయం పట్టణ లోని LIC కార్యాలయంలో ఏర్పాటు చేసిన వార్షికోత్సవ వేడుకల్లో కేక్ కట్ చేస్తున్న మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు .అనంతరం చైర్మన్ మాట్లాడుతూ భారత దేశంలోనే అతి పెద్ద సంస్థ ఈ LIC,ఈ సంస్థ ప్రభుత్వానికి నిదులను, పెట్టు బడులను అందించటంలోఎంతో ఉపయోగపడుతుంది,అదేవిదంగా ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఏజంట్ లుగా ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని, లక్షలాదిమంది ఉద్యోగస్తులు ఈ సంస్థలో పనిచేస్తునారని,ఈ సంస్థ అభివృద్ధి కి ప్రతి ఒక్కరు పాటు పడాలని,పాలసి దారులకి నాన్యమైన సేవలను అందించాలని అయన ఈ సందర్బంగా తెలిపారు . ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ D విజయ్ అంబేత్కర్,మాజీ కౌన్సిలర్ తుమ్మల ప్రభాకర్,బ్రాంచ్ స్టాఫ్,ఏజంట్లు,పాలసీ దారులు తదితరులు పాల్గొన్నారు.